Revanth Reddy: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు

Revanth Reddy: అధికారులు, పారశ్రామిక రంగ ప్రముఖులకు సూచనలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 July 2024 6:30 PM IST
CM Revanth Reddy instructions on setting up Skill University
X

Revanth Reddy: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు

Revanth Reddy: తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. నివేదిక ఆధారంగా 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.

అటు ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటీకీ అందుబాటులో ఉన్నందున... సిటీ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని చెప్పారు. కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతీ ఐదు రోజులకు ఓసారి సమావేసం కావాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story