CM Revanth Reddy: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష..

CM Revanth Reddy: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు.

Shekhar G
Published on: 19 Feb 2024 6:23 PM IST
Cm Revanth Reddy Holds Review Meeting Over Development Of Musi River
X

CM Revanth Reddy: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష..

CM Revanth Reddy: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. నానక్‌రామ్‌గూడలోని HMDA కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్‌పై పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story