Revanth Reddy: జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు- సీఎం రేవంత్
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి ఇళ్ల స్థలాన్ని పంపిణీ చేశారు.
CM Revanth Reddy
CM Revanth Reddy: జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి ఇళ్ల స్థలాన్ని పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం పేరుతో రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరిగింది.
సొసైటీకి ఇళ్ల స్థలంతో పాటు విధి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు సీఎం. జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిది అని హామీ ఇచ్చారు సీఎం.
ప్రెస్ అకాడమీకి 10కోట్ల స్పెషల్ ఫండ్‌ను అందిస్తామన్నరు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం అయ్యేలా చూస్తామని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.
Next Story




