CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 Nov 2024 10:33 AM IST
CM Revanth Reddy Delhi Tour
X

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ అంతర్గత సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతుండటంతో.. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

సీఎం రేవంత్ హస్తిన పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయాల‌న్న ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story