Revanth Reddy: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ ఏరియల్‌ సర్వే

Revanth Reddy: మొంథా తుపాను (Montha Cyclone) కారణంగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు పర్యటించారు.

Arun Chilukuri
Published on: 31 Oct 2025 4:07 PM IST
Revanth Reddy: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ ఏరియల్‌ సర్వే
X

Revanth Reddy: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ ఏరియల్‌ సర్వే

Revanth Reddy: మొంథా తుపాను (Montha Cyclone) కారణంగా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు పర్యటించారు. లక్షలాది ఎకరాల పంటలు నీటమునగడం, వేలాది ఇళ్లు దెబ్బతినడంతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి హెలికాప్టర్‌ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను నష్టం తీవ్రతను గమనించారు.

అనంతరం, హనుమకొండ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించారు. సమ్మయ్యనగర్ ప్రాంతంలో నీటమునిగిన కాలనీలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సర్వం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story