Revanth Reddy: సీఎం రేవంత్‌ కీలక ప్రకటన.. గ్యాస్‌, కరెంటు పథకాలు ప్రారంభం ఆ రోజే..

Revanth Reddy: మేడారంలో సమ్మక్క, సారలమ్మలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు.

Arun Chilukuri
Published on: 23 Feb 2024 3:39 PM IST
CM Revanth Reddy Announces Date of Implementation of Two Schemes
X

Revanth Reddy: సీఎం రేవంత్‌ కీలక ప్రకటన.. గ్యాస్‌, కరెంటు పథకాలు ప్రారంభం ఆ రోజే..

Revanth Reddy: మేడారంలో సమ్మక్క, సారలమ్మలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం వెళ్లి వనదేవతల్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారు చేశారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవుతారని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story