Vijayashanthi: సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్...

CM Means Criminal Minister Says Vijayashanthi
x

Vijayashanthi: సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్...

Highlights

Vijayashanthi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు.

Vijayashanthi: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం.. కేసీఆర్ ప్రభుత్వంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారమన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో చేపట్టిన బీజేపీ నిరుద్యోగ మహా ధర్నాలో పాల్గొన్నారు. పేపర్ లీకేజీలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ చేసేవన్నీ ఫ్రాడ్ పనులని, దాంట్లో మళ్లీ బేరాలు ఆడుతారని.. ఆయనకు కావాల్సింది లాభాలు మాత్రమేనని మండిపడ్డారు. మరోవైపు ప్రధానిపై అడ్డగోలుగా మాట్లాడుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు నోటీసులు ఇవ్వాలని బీజేపీ నేత డి కె అరుణ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories