తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమీక్ష

*హాజరుకానున్న మంత్రులు, ఉన్నతాధికారులు, వాతావరణశాఖ అధికారులు

Rama Rao
Published on: 10 July 2022 3:36 PM IST
CM KCRs Review of Heavy Rains in Telangana | TS News
X

తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమీక్ష

CM KCR: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, వాతావరణశాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రాణ, పశువులు, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్న సీఎస్‌ చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదకర ట్యాంకులకు ఏదైనా జరిగితే ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచేలా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు సీఎస్‌.

Rama Rao

Rama Rao

Next Story