ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ
x
Highlights

CM KCR: కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ.. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు తెలంగాణ...

CM KCR: కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ.. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. దేశ ప్రయోజనాల దృష్ట్యా గతంలో జీఎస్టీకి మద్దతిచ్చామని చెప్పారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పూర్తిగా చెల్లించాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. కేంద్రమే రుణం తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు. చట్టం ప్రకారం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే కేంద్రమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

లేఖ‌లోని సారాంశం.. న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసినా తెలంగాణ ప్ర‌భుత్వం జాతీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా జీఎస్టీ బిల్లును స‌మ‌ర్థించింది. మొట్ట‌మొద‌లు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది తెలంగాణ ప్ర‌భుత్వ‌మే అని గుర్తు చేశారు సీఎం. జీఎస్టీ ఫ‌లాలు దీర్ఘ‌కాలికంగా ఉండి.. రాబోయే రోజుల్లో మ‌రిన్ని పెట్టుబ‌డులు రావ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని అనుకున్నాం. సీఎస్టీని ర‌ద్దు చేసే స‌మ‌యంలో పూర్తి ప‌రిహారాన్ని అంద‌జేస్తామ‌ని అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. రాష్ర్టాలు సీఎస్టీ ప‌రిహారాన్ని తిర‌స్క‌రించాయి. స‌రిగ్గా ఇదే కార‌ణంపై రాష్ర్టాల ఒత్తిడి మేర‌కు రెవెన్యూ న‌ష్టాన్ని పూడ్చ‌డానికి ప్ర‌తి రెండు నెల‌ల‌కోసారి పూర్తి జీఎస్టీ ప‌రిహారం చెల్లించే విధంగా చ‌ట్టంలో క‌చ్చితంగా నిబంధ‌న ఉన్నా.. జీఎస్టీ ప‌రిహారం చెల్లింపులో జాప్యం కొన‌సాగుతోంది.

ఏప్రిల్ నుంచి రాష్ట్రాల‌కు జీఎస్టీ ప‌రిహారం అంద‌లేదు. కోవిడ్-19 కార‌ణంగా 2020, ఏప్రిల్లో నుంచి తెలంగాణ ప్రభుత్వం 83 శాతం రెవెన్యూను న‌ష్ట‌పోయింది. అదే స‌మ‌యంలో రాష్ట్రాల అవ‌స‌రాలు, పేమేంట్ల భారం పెరిగిపోయింది. మార్కెట్ బారోయింగ్స్ ద్వారా, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవ‌ర్ డ్రాఫ్ట్ ల ద్వారా ఈ ప‌రిణామాల నుంచి గ‌ట్టెక్కాల్సి వ‌చ్చింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్న కార‌ణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధార‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ బారోయింగ్‌ల‌కు కేంద్రంపై ఆధార‌ప‌డాల్సి వ‌స్తుంది. ఇది స‌మాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమ‌ని' సీఎం లేఖ‌లో పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories