KCR: తెలంగాణ ముందుకెళ్తుంటే.. దేశం వెనకబడిపోతోంది

CM KCR Wishes Ramadan to the People of the State
x

KCR: తెలంగాణ ముందుకెళ్తుంటే.. దేశం వెనకబడిపోతోంది 

Highlights

KCR: అన్ని వర్గాల విశ్వాసాలను కాపాడుతున్న రాష్ట్రం తెలంగాణ

KCR: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. దీనికి సీఎం కేసీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం 12వేల కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

అన్ని వర్గాల విశ్వాసాలను కాపాడుతున్న రాష్ట్రం తెలంగాణ అని, అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచామన్నారు. అయితే.. తెలంగాణ ముందుకెళ్తుంటే.. దేశం మాత్రం వెనకబడిపోతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని చురకలు అంటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories