ఇవాళ వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR: నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు

Jyothi
Published on: 16 Aug 2022 7:05 AM IST
CM KCR Will Visit Vikarabad District Today
X

ఇవాళ వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్‌తోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వికారాబాద్‌ జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకడంతోపాటు బహిరంగసభను విజయవంతం చేయాలని అధికారులకు, సూచించారు. తాండూరులో ఆటోనగర్‌, పాలిషింగ్‌ యూనిట్ల ఏర్పాటు, మార్కెట్‌యార్డు కోసం స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి సబిత ధన్యవాదాలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story