రేపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం!

రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించనున్నారు.

admin
Published on: 6 Nov 2020 7:02 PM IST
రేపు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం!
X

KCR 

రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి సీఎం కేసీఆర్ అంచనా వేయనున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు.. సవరించుకోవల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్‌తో పాటు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొనన్నారు. సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు.

admin

admin

Next Story