సీఎం కేసీఆర్‌కు ముగిసిన వైద్య పరీక్షలు

X
Highlights
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు ముగిశాయి. వైద్య పరీక్షల పూర్తి అనంతరం సీఎం...
Arun Chilukuri7 Jan 2021 11:30 AM GMT
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు ముగిశాయి. వైద్య పరీక్షల పూర్తి అనంతరం సీఎం ప్రగతిభవన్‌కు బయల్దేరి వెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌కు ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేశారు. అయితే, కేసీఆర్ ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్‌ఫెక్షన్ ఉందన్న వైద్యులు బ్లడ్ అండ్ 2డి ఈకో రిపోర్ట్స్ రావాల్సి ఉందన్నారు. కేసీఆర్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే చలికాలం కావడంతోనే స్వల్ప అస్వస్థత కలిగిందన్నారు.
Web Titlecm KCR visits Yashoda hospital for medical checkups
Next Story