నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్

Arun Chilukuri
Published on: 21 Oct 2020 5:37 PM IST
నాయినిని పరామర్శించిన సీఎం కేసీఆర్
X

తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కొద్దిరోజులక్రితం తీవ్ర అస్వస్థతకు గురైన నాయిని నర్సింహారెడ్డి అపోలో ఇన్సెంటివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. నాయినిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను కేసీఆర్ కోరారు. నాయిని కుటుంబ స‌భ్యుల‌కు సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు.

15 రోజుల క్రితం నాయినికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆయనకు నెగెటివ్‌ వచ్చింది. దీంతో కుదుటపడుతున్న ఆయనకు తిరిగి నిమోనియా సోకింది. శ్వాససంబంధ సమస్యలు తలెత్తడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే నాయిని నరసింహారెడ్డిని పలువురు టీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story