CM KCR: ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

CM KCR Visits Metpally
x

CM KCR: ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

Highlights

CM KCR: ఇటీవల మరణించిన మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాల్క సురేశ్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

CM KCR: ఇటీవల మరణించిన మెట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాల్క సురేశ్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ప్రభుత్వ విప్ , చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను వారి కుటుంబ సభ్యులను మెట్ పల్లి లోని నివాసంలో బుధవారం సీఎం పరామర్శించారు.

ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి , కొప్పుల ఈశ్వర్ , ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ , కె ఆర్ సురేష్ రెడ్డి , వెంకటేష్ నేత , ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి , టి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , సంజయ్ కుమార్ , ఏ . జీవన్ రెడ్డి , కోరుకంటి చందర్ , దాసరి మనోహర్ రెడ్డి , సుంకె రవి శంకర్ , నోముల భగత్ , జడ్పీ చైర్మన్లు దావా వసంత , పుట్ట మధు తదితరులు ఉన్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories