యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

Yadadri: ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాల వీక్షణ, లక్ష్మీనరసింహాస్వామిని దర్శింకున్న కేసీఆర్.

Sriveni Erugu
Published on: 8 Feb 2022 7:28 AM IST
CM KCR visited Yadadri
X

యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ 

Yadadri: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రిని సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత లక్ష్మీనారసింహాస్వామిని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామి వారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో స్వామి వారి ప్రసాదాన్ని సీఎంకు అందించారు.

ఆలయ సందర్శనంలో భాగంగా కళ్యాణకట్ట, పుష్కరిణి నిర్మాణ ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించి మంత్రులు, అధికారులకు సూచనలు చేశారు అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాలను సీఎం పరిశీలించారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలను సీఎం పరిశీలించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story