CM KCR: ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్

CM KCR: బోనకల్ మండలం రావినూతలలో పర్యటించిన కేసీఆర్

Dhatripriya
Published on: 23 March 2023 12:48 PM IST
CM KCR Visited Khammam District
X

CM KCR: ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్

CM KCR: ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్‌ నుంచి పరిశీలించారు. అనంతరం గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రావినూతల శివారులోని మొక్కజొన్న రైతులతో పంట నష్టంపై ఆరా తీశారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story