CM KCR: ఇవాళ పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR: బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌

Jyothi
Published on: 14 Nov 2023 9:38 AM IST
CM KCR Visit to Palakurthy, Haliya and Ibrahimpatnam Today
X

CM KCR: ఇవాళ పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక, సీఎం కేసీఆర్‌ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. నిన్న ఆయన రెండో విడత ప్రచారం ప్రారంభించారు.

రెండో విడతలో భాగంగా నేడు సీఎం కేసీఆర్‌ పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నాగార్జున సాగర్‌కు చేరుకోనున్న సీఎం కేసీఆర్‌..హాలియాలో బీఆర్ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 28వ తేదీ వరకు సీఎం 54 సభల్లో పాల్గొంటారు.

Jyothi

Jyothi

Next Story