Omicron: కాసేపట్లో జిల్లాల కలెక్టర్లతో ఒమిక్రాన్‌పై సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్

Omicron: క్వారంటైన్, టెస్ట్‌లపై ఆరా తీమనున్న సీఎం కేసీఆర్

Sandeep Eggoju
Published on: 30 Nov 2021 12:07 PM IST
CM KCR Video Conference With Collector on Omicron Variant Soon
X

కాసేపట్లో జిల్లా కలెక్టర్లతో ఓమిక్రాన్ వేరియంట్ పై వీడియో కాన్ఫరెన్స్ (ఫైల్ ఇమేజ్)

Omicron: కాసేపట్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. క్వారంటైన్, టెస్ట్‌లపై అధికారులను ఆరా తీయనున్నారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇక విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి వివరాలు వారిలో ఎవరికైనా పాజిటివ్ తేలిందా..? రెండోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేశారా? వంటి విషయాలపై వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది.

అన్ని జిల్లాల్లోని ఆర్టీపీసీఆర్ కేంద్రాలను తిరిగి పునరుద్దరించాలని ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. కావాల్సిన కిట్లు, రియోజెంట్లను ఇవ్వాల్సిందిగా వైద్యశాఖకు సూచన ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. ప్రతి రోజు జిల్లా కేంద్రంలో 3 వందల మందికి ఆర్టీపీసీఆర్ విధానంలో టెస్ట్ లు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశం ఇవ్వనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story