CM KCR: ఈరోజు యాదాద్రీశుని దర్శించుకోకున్న సీఎం కేసీఆర్

CM KCR: జాతీయ పార్టీ ప్రకటనకు ముందుగా దైవ ఆశీర్వాదం

Jyothi
Published on: 30 Sept 2022 8:10 AM IST
CM KCR to Visit Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple
X

CM KCR: ఈరోజు యాదాద్రీశుని దర్శించుకోకున్న సీఎం కేసీఆర్

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ..యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి ఉదయం 11.30 గంటలకు రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ తన కుటుంబం తరపున ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం కోసం కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. అనంతరం బాలాలయం ఆవరణలో కళావేదికకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు యాదాద్రి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరతారు. సీఎం కేసీఆర్‌ రేపు వరంగల్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీని సీఎం ప్రారంభిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story