Top
logo

సాయంత్రం ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

సాయంత్రం ఢిల్లీకి సీఎం కేసీఆర్‌
X
Highlights

సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్‌. పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు. అనంతరం ప్రతిపక్ష...

సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్‌. పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు. అనంతరం ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రైతుల నిరసనలో కూడా సీఎం కేసీఆర్‌ పాల్గొనే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

నూతన వ్యవసాయచట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉదృతంగా మారింది. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతులు తేల్చి చెబుతున్నారు. ఈనెల 12న ఢిల్లీ-జైపూర్‌ హైవే, ఢిల్లీ-ఆగ్రా హైవేలను దిగ్బంధిస్తామన్నారు. అదేవిధంగా అన్ని టోల్‌ ప్లాజాల దగ్గర టోల్‌ ఫ్రీ కార్యక్రమం చేపడ్తామన్నారు.

ఈనెల 14న ఉత్తరాది రాష్ట్రాల రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపడ్తారని, దక్షిణాది రాష్ట్రాల రైతులు స్థానిక జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుపడంతోపాటు బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తారని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఇక జియో ఉత్పత్తులను అంబానీల పెట్రోలియం ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్లు తెలియజేశారు.

Web TitleCM KCR to visit Delhi
Next Story