Telangana News: ఎల్లుండి బిహార్‌కు సీఎం కేసీఆర్.. ఎందుకంటే?
Telangana News: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బిహార్‌లో పర్యటించనున్నారు.
Telangana News: ఎల్లుండి బిహార్‌కు సీఎం కేసీఆర్.. ఎందుకంటే?
Telangana News: ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బిహార్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుండి ఆయన పాట్నా వెళ్లనున్నారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బిహార్‌కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం ఆర్థిక సాయం చేయనున్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేస్తారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు, మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
Next Story




