తెలంగాణలో మరో నాలుగు కలెక్టరేట్లు సిద్ధం

CM KCR To Inaugurate 4 More Collectorates In Telangana
x

తెలంగాణలో మరో నాలుగు కలెక్టరేట్లు సిద్ధం

Highlights

Telangana: ఈ నెల 25, 29 తేదీల్లో ప్రారంభించనున్న కేసీఆర్‌

Telangana: తెలంగాణలో పూర్తయిన నాలుగు సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాబోయే 20 రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ నెల 25న మధ్యాహ్నం 2గంటలకు రంగారెడ్డి కలెక్టరేట్‌ను, 29న పెద్దపల్లి, సెప్టెంబర్‌ 5న నిజామాబాద్‌, 10న జగిత్యాల కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. జిల్లాల విభజన తర్వాత అన్నిచోట్లా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయిదు మినహా అన్ని జిల్లాల్లో నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. గతవారం మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ కలెక్టరేట్లను సీఎం ప్రారంభించారు. దసరాకు ముందు అన్నింటినీ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక జిల్లాల పర్యటనలో భాగంగా కొన్ని చోట్ల టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సైతం సీఎం ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భవనాలు పూర్తయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories