Telangana: అసెంబ్లీకి హాజరు కానున్న సీఎం కేసీఆర్

Telangana: స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్న ఆస్ట్రియా బృందం

Rama Rao
Updated on: 15 March 2022 9:30 AM IST
CM KCR to Attend the Assembly | TS News
X

Telangana: అసెంబ్లీకి హాజరు కానున్న సీఎం కేసీఆర్

Telangana: ఇవాళ్టీతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. ఇటీవల అస్వస్థకు గురైన కేసీఆర్ ను వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆస్ట్రియా డేలిగేట్స్ తెలంగాణ అసెంబ్లీని సందర్శించనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఆస్ట్రియా బృందం.. అసెంబ్లీలో ఉండి సభ జరుగుతున్న తీరును పరిశీలించనుంది. అదేవిధంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం కేసీఆర్ తో ఆస్ట్రియా బృందం సమావేశం కానుంది. ఆ తర్వాత అస్ట్రీయా బృందం రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశం కానున్నారు.

Rama Rao

Rama Rao

Next Story