కేసీఆర్ వ్యూహం వెనుక అసలు కారణమేంటి.. మూడో ఫ్రంట్‌కు..

CM KCR Step Towards Third Front
x

కేసీఆర్ వ్యూహం వెనుక అసలు కారణమేంటి.. మూడో ఫ్రంట్‌కు..

Highlights

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ సర్కార్ పట్టుబడటం వెనుక అసలు కారణమేంటి..?

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్ సర్కార్ పట్టుబడటం వెనుక అసలు కారణమేంటి..? గతంలో కేంద్రంతో క్లోజ్‌గా మూవ్ అయిన కేసీఆర్ రెండు రోజుల నుంచి ఎందుకు ఫైర్ అవుతున్నారు..? తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆరెస్‌గా పొలిటికల్ హీట్ పెరగడం వెనుక అసలు కారణమేంటి.

తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆరెస్‌గా పొలిటికల్ హీట్ పెరిగింది. రెండు పార్టీల పెద్దల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో దూకుడు పెంచాలని భావించిన టీఆరెస్ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ప్రజలకు తెలిసేలా చేయాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియా సమావేశం పెట్టగానే ఎప్పుడూ లేని విధంగా సంజయ్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం కేసీఆర్. బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనమని తేల్చి చెప్పిందని బీజేపీ నేతలకు గుర్తు చేశారు కేసీఆర్. ఇదే సమయంలో తెలంగాణ రైతాంగానికి వరి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కొనదో అని బీజేపీ నేతలు అనడం ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు సీఎం. రైతాంగం మోసపోకుండా లాభసాటి పంటలను వేసుకోవాలని సూచించారు. అదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పాలని సవాల్ విసిరారు. కేంద్రం తీరుకు నిరసనగా శుక్రవారం రోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.

వడ్లని కేంద్రం కొనుగోలు చేసే వరకు పోరాటం చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసే పాదయాత్రలో రైతులు వడ్లు కొనమని అడుగుతారని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో బీజేపీ పార్టీ డైలమాలో పడింది. శుక్రవారం టీఆరెస్ పార్టీ నిరసన కార్యక్రమాలతో మరింత పొలిటికల్ హీట్ పెరగనుంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం సెస్‌ని తగ్గించాలని టీఆరెస్ డిమాండ్ చేస్తోంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను సీఎం కేసీఆర్ దిక్కుమాలిన పార్టీ అనడం కూడా రాజకీయ వేడిని రగిలిస్తోంది.

కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్ అవ్వడం వెనుక ఆంతర్యం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్ళడానికి కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి పెట్టిన సీఎం వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories