Budget Session: వైఎస్ ఉచిత కరెంట్ ప్రకటించినా ఉత్త కరెంట్‌గానే ఉండేది: కేసీఆర్

Budget Session: తెలంగాణలో 24 గంటల పవర్ సప్లై గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 17 March 2021 4:37 PM IST
CM KCR Speech on 24-hours Power Supply in Assembly
X

వైఎస్ ఉచిత కరెంట్ ప్రకటించినా ఉత్త కరెంట్‌గానే ఉండేది: కేసీఆర్

Budget Session: తెలంగాణలో 24 గంటల పవర్ సప్లై గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ హయాంలో ఉచిత కరెంట్ ప్రకటించినప్పటికీ అది ఉత్త కరెంట్‌గానే ఉండేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధికారం వచ్చాక రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాకతీయ కాల్వలమీద మోటార్లు పెట్టుకుంటున్నారని కరెంట్ అధికారులు ఫిర్యాదు చేస్తే రైతుల జోలికి వెళ్లొద్దన్నాని కేసీఆర్ తెలిపారు. రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా లిబరల్‌గా ఉన్నామని స్పష్టం చేశారు.

50 టీఎంసీల సామర్ధ్యంతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు రకరకాల ప్రయత్నాలు చేశాయని మండిపడ్డారు. కోర్టుల్లో 3 వందలకు పైగా కేసులు వేసినప్పటికీ అన్నిటినీ ఎదుర్కొని ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story