CM KCR: బీఆర్ఎస్​ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయ్

CM KCR: కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్‌

Shekhar G
Published on: 6 Aug 2023 6:34 PM IST
CM KCR Speech In Assembly Monsoon Session
X

CM KCR: బీఆర్ఎస్​ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయ్

CM KCR: బీఆర్ఎస్ పార్టీ అమ్ములపొదిలో ఇంకా చాలా ఎన్నికల హామీల అస్ర్తాలున్నాయని సీఎం కేసీఆర్​ అన్నారు. అసెంబ్లీలో రాష్ట్రాభివృద్ధిపై జరిగిన దీర్ఘకాలిక చర్చపై సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై సీఎం విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో అలవికాని హామీలు గుప్పించి కాంగ్రెస్​పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఖజానా సరిపోక.. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ నిధుల్ని మళ్లించి కన్నడనాట హామీల అమలుకు కాంగ్రెస్​ ప్రభుత్వం పూనుకుందని ఆయన తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story