వీఆర్‌వోల ఉద్యోగాలు ఎక్క‌డికి పోవు : సీఎం కేసీఆర్

వీఆర్‌వోల ఉద్యోగాలు ఎక్క‌డికి పోవు : సీఎం కేసీఆర్
x
Highlights

ప్రజలకు మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ర్టంలోని వీఆర్‌వోల‌కు...

ప్రజలకు మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ర్టంలోని వీఆర్‌వోల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో రెవెన్యూ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ర్టంలో అనివార్య ప‌రిస్థితుల్లోనే వీఆర్‌వో వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. వీఆర్‌వోల‌ను వివిధ శాఖ‌ల్లో స‌ర్దుబాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

5485 మంది వీఆర్‌వోలు వ‌ర్కింగ్‌లో ఉన్నారు. వీరంద‌రికి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌న్నారు. వీఆర్‌వోల ఉద్యోగాలు ఎక్క‌డికి పోవు. రాబోయే రోజుల్లో వారికి ఆప్ష‌న్లు ఇస్తామ‌న్నారు. రెవెన్యూ సంస్కరణల వల్ల ప్రజల ఇబ్బందులు తొలగుతాయని, ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. వీఆర్వోలు ఆందోళన చెందవద్దని వారిని స్కేల్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామ తెలిపారు. స్థాయికి తగినట్టు వీఏవోలకు వివిధశాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. తా‌సీల్దార్లు, ఆర్డీవోలు అలాగే ఉంటారు. భూ వివాదాల‌పై తాసీల్దార్లు, ఆర్డీవో, జేసీలు ఆర్డ‌ర్లు ఇస్తార‌ని పేర్కొన్నారు. ఆర్డ‌ర్లు ఇచ్చిన రెవెన్యూ అధికారుల వ‌ద్దే కోర్టులు ఉన్నాయి. ఇక నుంచి రెవెన్యూ కోర్టులు ఉండ‌వు అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.





Show Full Article
Print Article
Next Story
More Stories