CM KCR: తెలంగాణకు మోడీయే ప్రధాన శత్రువు.. సంస్కరణల పేరుతో పేదలకు శఠగోపం..

CM KCR: 8 ఏళ్ల అధికారంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచిపని చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

Arun Chilukuri
Published on: 16 Aug 2022 6:21 PM IST
CM KCR Slams PM Narendra Modi in Vikarabad
X

CM KCR: తెలంగాణకు మోడీయే ప్రధాన శత్రువు.. సంస్కరణల పేరుతో పేదలకు శఠగోపం..

CM KCR: 8 ఏళ్ల అధికారంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచిపని చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వికారాబాద్‌ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. సంస్కరణల పేరుతో కేంద్రం పేదలకు శఠగోపం పెడుతోందని అన్నారు. తెలంగాణకు ప్రధాని మోడీయే ప్రధాన శత్రువు అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని చెప్పుకొచ్చారు.

అద్భుతమైన భారత నిర్మాణం కోసం మనం ముందుండాలని ఉజ్వల భారత్ దిశగా ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధాని నిన్న గంట మాట్లాడారు. అంతా గ్యాసే. నెత్తికి రుమాల్‌ కట్టి వేషం తప్ప ఏముంది. డైలాగులు తప్ప దేశానికి మంచిమాట ఉందా. బీజేపీ జెండా పట్టుకొని నా బస్‌కు అడ్డం వసార్తా?. వికారాబాద్‌కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలి. బీజేపీని నమ్ముకుంటే మనకు మళ్లీ పాత రోజులే వస్తాయి అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story