CM KCR: సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్

CM KCR Said that  Ambedkar was a Role Model For Every One
x

CM KCR: సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్ 

Highlights

CM KCR: అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని ఎదుర్కొన్న అంబేద్కర్

CM KCR: కష్టంతో కూడుకున్న ఎంతటి సుధీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవడం ఖాయమన్నారు తెలంగాణ CM KCR. ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితమే నిదర్శనమని తెలిపారు. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నా.. ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేద్కర్ అని కొనియాడారు.

అసమానతలు లేని, ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు, సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్ అని అన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని వారి జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టించడం.. తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని చెప్పారు సీఎం కేసీఆర్. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపులో భాగంగా దేశంలోనే మరెక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే పేరు పెట్టి అంబేద్కర్ ను సమున్నతంగా గౌరవించుకున్నామని అన్నారు సీఎం కేసీఆర్.

ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రకాశ్ అంబేద్కర్ తో కలిసి భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories