ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి : కేసీఆర్

ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి : కేసీఆర్
x
CM KCR(File photo)
Highlights

వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు

వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్ లు ఏర్పాటు చేయాలని, నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలోని అన్ని పంపుల నిర్మాణం మే నెలాఖరు నాటికి పూర్తి చేసి, కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని పంప్ చేయాలని సిఎం ఆదేశించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

వర్షాకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ప్రారంభం కాగానే మొదట అన్ని చెరువులు, కుంటలు నింపాలని, దీనికోసం అవసరమైన ఓటీలను, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను వెంటనే నిర్మించాలని అన్నారు. తెలంగాణలో చెరువులు, కుంటలు ఏడాదంతా నిండి ఉండే వ్యూహం అవలంభించాలని కేసీఆర్ వెల్లడించారు. చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ వానాకాలంలో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలని, అధికారులు రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దనని కేసీఆర్ పేర్కొన్నారు.

ఎంతో వ్యయం చేసి ప్రాజెక్టులు నిర్మించామని, వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యమని అన్నారు. ప్రతీ ప్రాజెక్టు నిర్వహణ కోసం ఓ అండ్ ఎం మాన్యువల్ రూపొందించాలని, ప్రతీ ఏటా బడ్జెట్లోనే నిర్వహణ వ్యయం కేటాయించి, క్రమం తప్పకుండా ప్రభుత్వం విడుదల చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories