CM KCR: తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు ఉండాలి

CM KCR: శాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశం

Jyothi
Published on: 25 May 2023 5:05 PM IST
CM KCR Review On Telangana Formation Day Celebrations At Secretariat
X

CM KCR: తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు ఉండాలి

CM KCR: తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు ఉండాలని, పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కల్లెక్టర్లు సమావేశమయ్యారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ సూచించారు.

గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కేసీఆర్ వివ‌రించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లతో సమావేశం ముగిసిన అనంతరం.. సచివాలయం ప్రధాన ద్వారం వద్ద అధికారులు, సిబ్బందితో గ్రూప్‌ ఫొటో దిగారు సీఎం కేసీఆర్.

Jyothi

Jyothi

Next Story