Telangana: నూత‌న స‌చివాల‌యం నిర్మాణంపై సీఎం కేసీఆర్ స‌మీక్ష

CM KCR Review on Construction of new Secretariat
x

ఫైల్ ఫోటో 

Highlights

Telangana: పనుల నాణ్యతను పరిశీలించిన సీఎం కేసీఆర్ * దేశానికి వన్నెతెచ్చేలా నిర్మించాలని అధికారులకు సూచన

Telangana: చరిత్రకు సాక్ష్యాలు కట్టడాలు. అలాంటి శాశ్వత కట్టడాలపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. అది కాళేశ్వరమైనా.. సచివాలయమైనా అద్భుత దృశ్య కావ్యంగా నిలిచిపోవాల్సిందే.. దేశానికే వన్నెతెచ్చేలా తెలంగాణ సెక్రటేరియట్‌ను రూపొందిస్తున్నారు. పనుల్లో నాణ్యత తగ్గకుండా సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తున్నారు.

తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి. పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండు సార్లు సమీక్ష నిర్వహించారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్, బీజ్ స్టాండ్ స్టోన్, నాచురల్ బీజ్, నాచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సీఎం పరిశీలించారు.

సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతంలో సీఎం కలియ తిరుగుతూ నిర్మాణాల నాణ్యతను పరిశీలించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

సచివాలయ ఆవరణలో పలు రకాల పూల మొక్కలు, పచ్చికబయళ్లు, విశాలమైన అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ధోల్ పూర్ స్టోన్‌తో ఫౌంటేన్లను తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సూచించారు. అన్ని వసతులతో డెడ్‌లైన్‌ కంటే ముందు పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మొత్తానికి నూతన సచివాలయం తెలంగాణాకే తలమానికంగా నిలువనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories