Palle Pragathi: ఈనెల 28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

CM KCR Review Meeting With District Collectors 28th June on Palle Pragathi
x

కేసీఆర్‌(ఫైల్ ఇమేజ్ )

Highlights

Palle Pragathi: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పనుల పురోగతి, అధికారుల పనితీరు నిధుల వినియోగం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 28న జిల్లా కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు.

Palle Pragathi: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పనుల పురోగతి, అధికారుల పనితీరు నిధుల వినియోగం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 28న జిల్లా కలెక్టర్లతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కలెక్టర్లతోపాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. కాగా, జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories