హైదరాబాద్: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

X
Highlights
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం అయ్యారు. అధికారులు అనుక్షణం...
Arun Chilukuri21 Oct 2020 7:24 AM GMT
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం అయ్యారు. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. వరద ముంపులో కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని సీఎం తెలిపారు. వదర ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ కోరారు.
Web Titlecm KCR review meeting on Hyderabad floods
Next Story