Top
logo

ఆర్మూర్‌, నిర్మల్, భైంసా ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు- సీఎం కేసీఆర్‌

CM KCR Review Meeting on Heavy Rains
X

ఆర్మూర్‌, నిర్మల్, భైంసా ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు- సీఎం కేసీఆర్‌

Highlights

Heavy Rains: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

Heavy Rains: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజాప్రతినిధులు, అధికారులను అలర్ట్‌ చేశారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం నమోదు తీరును, ఎస్సారెస్పీ నుంచి మొదలుకొని, కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజ్‌ల పరిధిలోని వరద పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు వివరించారు అధికారులు.

సీఎస్‌తో పాటు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌. తక్షణమే కొత్తగూడెం, ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు ఆర్మీ చాపర్‌లో సీనియర్‌ అధికారులను పంపాలని ఆదేశించారు. అలాగే ఆర్మూర్‌, నిర్మల్‌, భైంసా ప్రాంతాలకు వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లను పంపాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు సీఎం. నిరాశ్రయులకు షెల్టర్‌, బట్టలు, భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నారు కేసీఆర్‌.

Web TitleCM KCR Review Meeting on Heavy Rains
Next Story