Nagarjuna Sagar By Poll: కాసేపట్లో నాగార్జునసాగర్‌కు సీఎం కేసీఆర్‌

Nagarjuna Sagar By Poll: హాలియాలో సా.4 గంటలకు కేసీఆర్‌ బహిరంగ సభ

Samba Siva Rao
Published on: 14 April 2021 12:04 PM IST
CM KCR Public Meeting Today 14th April 2021 at 4 PM for Nagarjuna Sagar By Poll Constituency
X

కెసిఆర్ ఫైల్ ఫోటో 

Nagarjuna Sagar By Poll: సాగర్ ఉపఎన్నికతో రాజకీయం వేడెక్కింది. కాసేపట్లో నాగార్జునసాగర్‌కు సీఎం కేసీఆర్‌ బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. ఈ సభకు భారీగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు తరలిరానున్నారు. దీంతో సభకు వచ్చేవారికి మాస్క్ తప్పనిసరి చేశారు పోలీసులు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సభ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహాయ్య తనయుడు భగత్ పేరు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. ఇక బీజేేపీ అభ్యర్థిగా డా. రవికుమార్ బరిలో ఉన్నారు. దీంతో సాగర్ ఉపఎన్నిక మూడు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మూడు పార్టీ విజయంపై ధీమాగా ఉన్నాయి. ఏప్రిల్‌ 17న ఎన్నికల పోలింగ్‌ జరుగనుండగా.. మే 2న ఫలితం వెల్లడికానుంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story