CM KCR: ఇవాళ చండూరు మండలంలో సీఎం కేసీఆర్ సభ

CM KCR: ఆసక్తికరంగా మారనున్న కేసీఆర్ స్పీచ్

Jyothi
Published on: 30 Oct 2022 6:49 AM IST
CM KCR Public Meeting in Chandur Mandal Today
X

CM KCR: ఇవాళ చండూరు మండలంలో సీఎం కేసీఆర్ సభ

CM KCR: మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నిక ప్రచార ముగింపునకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు దూకుడు పెంచాయి. నవంబర్ 1న సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం చండూరులో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డలో జరిగే సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారా అని యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తోంది. సీఎం సభ కోసం క్యాడర్ భారీ ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున జన సమీకరణకు నేతలు ప్లాన్ చేశారు.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలవాలనేది అధినేత కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బైపోల్ షెడ్యూల్ రాక ముందు నుంచే నియోజకవర్గ నాయకులతో సమీక్షలు నిర్వహించారు. ఎలాంటి వ్యూహం అనుసరించాలో మంత్రులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. దీంతో నియోజకవర్గం అంతా టీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఇక సభ ద్వారా టీఆర్ఎస్‌కు మరింత మైలేజీ వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి.

Jyothi

Jyothi

Next Story