తెలంగాణ సీఎం పీఆర్వో పదవికి విజయ్‌ కుమార్‌ రాజీనామా

Arun Chilukuri
Published on: 3 March 2021 1:04 PM IST
CM KCR pro vijay kumar resigned to his post
X

తెలంగాణ సీఎం పీఆర్వో పదవికి విజయ్‌ కుమార్‌ రాజీనామా

తెలంగాణ సీఎం పీఆర్వో పదవికి విజయ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. విజయ్‌పై, అతడి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన కేసీఆర్‌ విజయ్‌ను పదవి నుంచి తొలగించారు. మరోవైపు ట్రాన్స్‌కోలో ఉన్నత ఉద్యోగానికి కూడా విజయ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్‌ వేదికగా తన రాజీనామా అంశాన్ని ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చి, గొప్ప పొజిషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story