CM KCR: భవిష్యత్ రాజకీయాల దిశగా చక్కటి ముందడుగు పడింది..

CM KCR: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం ఇద్దరు సీఎంలు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 5:36 PM IST
CM KCR: భవిష్యత్ రాజకీయాల దిశగా చక్కటి ముందడుగు పడింది..
X

CM KCR: భవిష్యత్ రాజకీయాల దిశగా చక్కటి ముందడుగు పడింది..

CM KCR: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అనంతరం ఇద్దరు సీఎంలు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్రతో తమది సోదర సంబంధం అని, రెండు రాష్ట్రాల మధ్య వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉందని, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కలిసి నడుస్తామంటూ కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరించారు కేసీఆర్.

ఇక దేశ భవిష్యత్ చిత్రపటాన్ని మార్చే విషయంలో తమ మధ్య పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, తమతో పాటు కలిసి వచ్చే ఇతరుల్ని కూడా కలుపుకొని పోతామన్నారు. ఈ చర్చల్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో గానీ, మరో చోట గానీ సమావేశం అవుతామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రేను హైదరాబాద్ ఆహ్వానించారు కేసీఆర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story