సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్.. వాటిపై స్పందిస్తారా..?

CM KCR Press Meet at 4PM Today
x

సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్.. వాటిపై స్పందిస్తారా..?

Highlights

KCR Press Meet: ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

KCR Press Meet: ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు వారంపాటు ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్ర సమస్యలు, వరద సాయం కేంద్రం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీనిపై ఇంకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. వర్షాలు, వరదలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. కేంద్రం విధానాలు, వైఖరిపై సీఎం మాట్లాడనున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై CM మాట్లాడే అవకాశంఉంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, ఆ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్‌, ఈడీ దాడుల వార్తలపై.. కేసీఆర్ కౌంటర్ ఎటాక్‌ చేసే అవకాశం ఉందనే తెలుస్తోంది. కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడుతారా? అన్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌లైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories