మరోసారి హస్తినకు గులాబీ బాస్.. రైతు కుటుంబాలను..

CM KCR Delhi Tour: మరోసారి సీఎం కేసీఆర్ హస్తిన బాట పట్టనున్నారు.

Arun Chilukuri
Updated on: 15 April 2022 9:16 PM IST
CM KCR Plans For Delhi Tour Again
X

మరోసారి హస్తినకు గులాబీ బాస్.. రైతు కుటుంబాలను..

CM KCR Delhi Tour: మరోసారి సీఎం కేసీఆర్ హస్తిన బాట పట్టనున్నారు. మూడు రోజుల్లో ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రైతు నేతలతో సమావేశమై నూతన వ్యవసాయ విధానంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి అక్కడ రైతుల కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు. లఖింపూర్ ఖేరీలో రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్ దూసుకురావడంతో నలుగురు రైతులు చనిపోయారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే అవకాశం ఉంది. రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story