ఏపీ రైతుకు కేసీఆర్ ఫోన్..ఎందుకంటే..?

X
Highlights
ఆంధ్ర ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. తాను కారు పంపిస్తానని, వచ్చి భోజనం చేసి వెళ్లాలంటూ కృష్ణా...
Arun Chilukuri20 Dec 2020 7:08 AM GMT
ఆంధ్ర ఆదర్శ రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. తాను కారు పంపిస్తానని, వచ్చి భోజనం చేసి వెళ్లాలంటూ కృష్ణా జిల్లా ఘంటసాలపాలెంకు చెందిన రైతు ప్రసాదరావును తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. వెద పద్ధతిలో సాగు అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రసాదరావు 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశారు. ఈ పద్ధతిలో ఎకరానికి 40 నుంచి 45 బస్తాల దిగుబడి సాధించారు.
ప్రసాదరావు వ్యవసాయ పద్ధతుల గురించి తెలిసిన సీఎం కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు.
Web TitleCM KCR Phone Call to AP Farmer Uppala Prasad Rao
Next Story