కేసీఆర్‌కు గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేవు : యశోద వైద్యులు

CM KCR: సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Arun Chilukuri
Published on: 11 March 2022 3:40 PM IST
CM KCR Personal Doctor MV Rao Press Meet About KCR Health Condition
X

CM KCR: సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్‌కు యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాకు వివరించారు. కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు డా.ఎంవీ రావుతో పాటు మరికొందరు యశోద ఆస్పత్రి వైద్యులు వివరాలను వెల్లడించారు. లెఫ్ట్‌ హ్యాండ్‌ చేతి వైపు నొప్పిగా ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేశామన్నారు.

యాంజియోగ్రామ్ చేశామని, ఎలాంటి బ్లాక్స్ లేవని తెలిపారు వైద్యులు. కార్డియో వైపు నుంచి కూడా ఎలాంటి సమస్యలు లేవని.. బ్రెయిన్ MRI టెస్ట్ కూడా చేశామన్నారు వైద్యులు. బీపీ, షుగర్ నార్మల్ గా ఉందని ప్రస్తుతం సీఎంకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు వెల్లడించారు. నెల నెల వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు డాక్టర్లు. అలాగే వారం రోజులకు ఒకసారి షుగర్‌ టెస్ట్‌లు చేసుకోవాలని వైద్యులు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story