CM KCR: కైకాల మృతి బాధాకరం.. ఈ జనరేషన్‌ నటుల్లో ఆయనకు సమానులు లేరు

* కైకాల కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం కేసీఆర్

R Tripura Malini
Published on: 23 Dec 2022 4:46 PM IST
CM KCR Paid Tributes To Kaikala Body
X

కైకాల పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ 

Kaikala: కైకాల సత్యరాయణ పార్థీవ దేహానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజకీయాల్లో కైకాలతో కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. సత్యనారాయణ మృతి సినీ రంగానికి తీరని లోటని కేసీఆర్‌ అన్నారు. స‌త్య‌నారాయ‌ణ లోటును ఎవ‌రూ కూడా పూడ్చ‌లేరు. ఆయ‌నకు స‌మాన‌మైన న‌టులు కూడా ఇప్పుడు లేరు. ఆయ‌న పోషించిన పాత్ర‌లు అద్భుతం అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. సీఎంతో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, మాగంటి గోపినాథ్‌ కైకాల భౌతిక‌కాయానికి నివాళులర్పించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story