CM KCR: వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయాను.. మహేశ్‌బాబును ఓదార్చిన సీఎం కేసీఆర్‌

CM KCR: సుప్రసిద్ధ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మనమధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమన్నారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri
Published on: 15 Nov 2022 2:53 PM IST
CM KCR Pays Tribute to Super Star Krishna
X

CM KCR: వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయాను.. మహేశ్‌బాబును ఓదార్చిన సీఎం కేసీఆర్‌

CM KCR: సుప్రసిద్ధ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మనమధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమన్నారు సీఎం కేసీఆర్. వ్యక్తిగతంగా తాను మంచి మిత్రుడిని కోల్పోయానని తెలిపారు. కృష్ణ ఆతిథ్యమిస్తే చాలా సార్లు ఆయన ఇంటికి వచ్చాను. ఎలాంటి అరమరికలు లేకుండా ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. పార్లమెంట్‌ సభ్యుడిగా దేశానికి సేవలందించారు. అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తి సినిమాను తీశారు. కృష్ణ సేవలను, ఆయన చేసిన దేశభక్తి ప్రయత్నాన్ని గుర్తిస్తూ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించాం. ఆయన కుటుంబసభ్యులకు దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని కేసీఆర్‌ అన్నారు. కృష్ణ పార్థీవదేహానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్ మహేష్‌బాబు, నరేష్‌ను ఓదార్చారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజును చిత్రాన్ని తాను చాలాసార్లు చూశానని కేసీఆర్ తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story