CM KCR: సాయిచంద్‌ భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

CM KCR Pays Tribute To Folk Singer Sai Chand
x

CM KCR: సాయిచంద్‌ భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

Highlights

CM KCR: సాయిచంద్ కుటుంబాన్ని ఓదార్చిన సీఎం కేసీఆర్‌

CM KCR: తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ పార్థివదేహం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సాయిచంద్‌ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ ఎదుట సాయి చంద్ భార్య బోరును విల‌పించింది. కేసీఆర్‌ను చూసి ఆమె దుక్కాన్ని త‌ట్టుకోలేక‌పోయింది. ఏడుస్తున్న సాయి చంద్ భార్య‌ను సీఎం కేసీఆర్ ఓదార్చారు. తానున్నాంటూ సీఎం వారికి భరోసా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories