కాళోజీ ప్రజల గొంతుక : సీఎం కేసీఆర్

X
Highlights
ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళి...
Arun Chilukuri9 Sep 2020 7:41 AM GMT
ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు నివాళి అర్పించారు. ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజి చిరస్మరణీయులని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారని చెప్పారు.
రవీంద్ర భారతిలో ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
Web TitleCM KCR paid tributes to Praja Kavi Kaloji Narayana Rao on his birth anniversary
Next Story