CM KCR: ప్రతి ఒక్కరిలో దేశభక్తి, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి నింపాలి..

CM KCR Ordered to Organize Independent India Diamond Festival Grandly
x

CM KCR: ప్రతి ఒక్కరిలో దేశభక్తి, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి నింపాలి..

Highlights

CM KCR: స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ పిలుపు

CM KCR: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్వాతంత్ర్య ఉత్సవాలపై ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు కమిటీ చైర్మన్‌ కేకేతో పాటు మరో 24 మంది సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8 నుంచి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 8న ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దేశ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇంటింటికీ పంపిణీ చేసేందుకు కోటి మువ్వన్నెల జెండాలను సిద్ధం చేశారు అధికారులు. అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. అలాగే అన్ని సినిమా థియేటర్లలో విద్యార్థులకు ఉచితంగా దేశభక్తి చాటే సినిమాలను ప్రదర్శించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories