'ఎట్ హోమ్' కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు.. ఆఖరి నిమిషంలో..

CM KCR Not Attended TO At Home Programme
x

‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు.. ఆఖరి నిమిషంలో..

Highlights

At Home Programme: తెలంగాణ రాజ్‌భవన్‌లో నిర్వహించే గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.

At Home Programme: తెలంగాణ రాజ్‌భవన్‌లో నిర్వహించే గవర్నర్ తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఆఖరి నిమిషంలో ఎట్‌హోమ్‌ కార్యక్రమాన్ని కేసీఆర్‌ రద్దు చేసుకున్నారు. సీఎం రాక కోసం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అరగంటపాటు ఎదురు చూశారు. ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని రాజ్ భవన్ వర్గాలకు సీఎంవో సమాచారం పంపింది. సీఎం వెళ్లకపోవడంతో టీఆర్ఎస్ నాయకులు, ప్రతినిథులు కూడా వెళ్లలేదు. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, హైదరాబాద్ సీపీ ఆనంద్, రాచాకొండ సీపీ మహేష్ భగవత్ మాత్రమే హాజరయ్యారు. ఇక కరోనా కారణంగా తేనేటి విందుకు హాజరు కాలేకపోతున్న పీసీసీ రేవంత్ రెడ్డి, పాదయాత్ర కారణంగా బండి సంజయ్ రాలేకపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories